: జియో ఉచిత ఆఫర్పై మరోసారి మండిపడ్డ ఎయిర్టెల్ ఛైర్మన్
టెలికం రంగంలో రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఆఫర్ల పట్ల మండిపడుతున్న ఇతర టెలికం కంపెనీలు మరోసారి జియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జియో ఉచిత వాయిస్ కాల్ ఆఫర్పై విచారణ జరిపి ఇటీవలే ట్రాయ్ క్లీన్చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ పలు వ్యాఖ్యలు చేశారు. జియో ఉచిత వాయిస్ కాల్ ఆఫర్పై క్లీన్‌చిట్ ఇచ్చిన ట్రాయ్ మళ్లీ ఈ అంశాన్ని సమీక్షించాలని, ఏదీ ఎప్పటికీ జీవితకాలం ఉచితంగా ఉండబోదని అన్నారు. జియో జీవితకాల ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లు అభ్యంతరకరంగా ఉన్నాయని మిగతా కంపెనీలు కూడా ఆరోపిస్తున్నాయి. జియోకు ఇంటర్కనెక్షన్ ఇవ్వడం లేదని పలు కంపెనీలకు ట్రాయ్ ఇటీవలే భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనిపై సునీల్ మిట్టల్ స్పందిస్తూ... ఈ అంశంపై ట్రాయ్ తికమక పడిందని అన్నారు.