: టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్...నెంబర్ వన్ బౌలర్ కూడా మనోడే!
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా 115 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా, రెండో స్థానంలో దాయాది పాకిస్థాన్ 111 పాయింట్లతో నిలిచింది. మూడో స్థానంలో 108 పాయింట్లతో ఆస్ట్రేలియా నిలబడింది. తరువాతి స్థానాల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ నిలిచాయి. న్యూజిలాండ్ సిరీస్ లో రాణించి, 200 వికెట్ల క్లబ్ లో చేరిన అశ్విన్ టెస్టు బౌలర్లలో అగ్రస్థానం సంపాదించగా, సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా ఐదో స్థానంలో నిలిచాడు. టెస్టు బ్యాట్స్ మెన్ జాబితాలో అజింక్యా రహానె ఆరో ర్యాంక్ లో నిలవగా, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ 15, 17వ ర్యాంకుల్లో నిలిచారు.