: ఒడిశా సీఎంపై గుడ్ల దాడి...యువకుడ్ని చితకబాదిన బీజేడీ కార్యకర్తలు
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై గుడ్ల దాడి జరిగింది. మయూర్ భంజ్ జిల్లాలో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి, సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సమయంలో సభికులనుద్దేశించి ఆయన మాట్లాడేందుకు సంసిద్ధుడవుతున్న సమయంలో ఓ యువకుడు కోడిగుడ్లతో దాడి చేశాడు. దీతో అప్రమత్తమైన బీజేడీ కార్యకర్తలు అతనిని చుట్టుముట్టి చితక్కొట్టారు. పోలీసులు అడ్డుకున్నా అతనిపై చాలాసేపు దాడి జరగడం విశేషం. కాగా, సదరు యువకుడు కాంగ్రెస్ విద్యార్థి నేత అని తెలుస్తోంది.