: చంద్రబాబు, లోకేశ్ మా నుంచి తప్పించుకోలేరు: మావోయిస్టుల సంచలన ప్రకటన


ఏవోబీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ పలు హెచ్చరికలు చేశారు. కోవర్టు ఆపరేషన్ ద్వారా ఆహారంలో విషం కలిపి, మావోయిస్టులు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. ఏవోబీ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేశ్ తమ నుంచి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడులు జరుపుతామని ఆయన సూచించారు. ఎల్లకాలం పోలీసులు, మిలట్రీ కాపాడలేవని ఆయన స్పష్టం చేశారు. తమకు సంబంధించిన తుపానుల్లో ఇది అతిపెద్ద తుపాను అని, దీనిని తట్టుకుని నాలుగు రోజుల్లో నిలబడతామని ఆయన ప్రకటించారు. ఉద్యమకారులను దేశ ద్రోహులుగా చిత్రీకరించి, విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమంగా కోట్లకు కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు, ఎంపీల వైపు ప్రభుత్వాలు కన్నెత్తి చూడడం లేదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News