: అమితాబ్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్
సినీ పరిశ్రమలో హీరోయిన్లకన్నా హీరోలే ఎక్కువ పారితోషికం తీసుకోవడం సహజం. ముఖ్యంగా స్టార్ యాక్టర్లకు భారీ రెమ్యునరేషన్ ఉంటుంది. అయితే, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 'పీకూ' సినిమాకు తన కంటే హీరోయిన్ దీపికా పదుకొనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందని అమితాబ్ స్వయంగా తెలిపారు. మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బిగ్ బీ కంటే దీపికా ఎక్కువ పారితోషికం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, దీపిక పాత్ర పెద్దది కావడం, హాలీవుడ్ లో కూడా ఫాలోయింగ్ ఉండటంతో దీపికకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారట.