: భర్తతో కలిసి ఉంటానని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన రంభ
ప్రముఖ సినీ నటి రంభ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. టాలీవుడ్ లో రంగప్రవేశం చేసి, కోలీవుడ్, బాలీవుడ్ లో రాణించిన రంభ 2010 ఏప్రిల్ లో కెనడాకు చెందిన ఇందిరన్ పద్మనాభన్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్నేళ్లుగా వీరు విడిగా ఉంటున్నారు. ఇప్పుడు తాను తన భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నానని, అందుకు వీలు కల్పించాలని కోరుతూ రంభ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని డిసెంబర్ 3న న్యాయస్థానం విచారించనుంది.