: నన్నెప్పుడూ వారు మహారాణిలా చూసుకుంటారు: మంచు లక్ష్మి

సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా కనపడుతూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తోన్న మంచు లక్ష్మీ ప్రసన్న త‌న మెట్టినింటివారితో హాయిగా గ‌డిపారు. మంచు ల‌క్ష్మి మెట్టినింటి వారు చెన్నై నుంచి హైదరాబాద్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వారితో ముచ్చ‌టిస్తూ ఆమె వారి మ‌ధ్య సంతోషంగా గ‌డిపింది. వారంద‌రితో ఫొటో దిగి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె 'మై ఇన్‌ లాస్.. నన్ను వారెప్పుడూ ఓ మహారాణిలా చూసుకుంటారు. వారికి ప్రేమించడం తప్ప మరొకటి తెలియ‌దు' అని పేర్కొంది.

More Telugu News