: టాటాపై కేవియట్ దాఖలు చేసిన సైరస్ మిస్త్రీ

టాటాగ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ నేషనల్ లా ట్రైబ్యునల్ లో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. టాటా సన్స్, రతన్ టాటా, దొరాబ్జీ టాటా ట్రస్టు, టాటా గ్రూప్ పై సైరస్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నాలుగు కేవియట్ పిటిషన్ లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. కేవియట్ పిటిషన్ వేయడం ద్వారా టాటాగ్రూప్ జరిపే దర్యాప్తు తనకు తెలియకుండా చేయకూడదన్న ముందస్తు జాగ్రత్తతో ఆయన కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేవియట్ పిటిషన్లపై పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేగుతోంది. కేవియట్ పిటిషన్లు వేయడం ద్వారా రతన్ టాటాతో సైరస్ మిస్త్రీ అమీతుమీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

More Telugu News