: శివాలయంలో ఒక్కటైన ముస్లిం జంట!
మనదేశంలో మత సామరస్యం పరిఢవిల్లుతోందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. బీహార్ లోని భీమ్ నగర్ గ్రామానికి చెందిన మహ్మద్ సోహాన్ (25), నూరేషా ఖతూన్ (20) ప్రేమికులు. గత ఐదేళ్ల నుంచి వారి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో, గ్రామం వదిలి పారిపోయారు. దీంతో, రంగంలోకి దిగిన ఆ గ్రామ పెద్దలు ఆ జంటను ఒకటి చేయాలని నిర్ణయించారు. ఒక సుముహూర్తంలో గ్రామ శివాలయంలో సోహాన్, నూరేషా ఖతూన్ ల వివాహం జరిపించారు. ఈ వేడుకకు హిందూ, ముస్లింలు హాజరయ్యారు. ఈ సంఘటన మరిచిపోలేనిదని ముస్లిం మత పెద్ద మాల్వీ జాఫర్ చెప్పగా, ప్రతి ఏటా పెళ్లి రోజున ఇక్కడికే వస్తామని నూతన వధువు తెలిపింది.