: పాకిస్థాన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో భారీ ఉగ్రదాడిపై స్పందించిన మనోహర్ పారికర్

పాకిస్థాన్‌లోని క్వెట్టాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీసు శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 60కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు 250 మందిని క్షేమంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చాయి. మ‌రో 300 మంది వ‌ర‌కు లోప‌లే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌లువురిని ఉగ్ర‌వాదులు బందీలుగా తీసుకున్నారు. ఈ దాడిపై భార‌త రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్ర‌వాదులు జ‌రిపిన‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాకిస్థాన్ సైన్యానికి సంతాపం తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. తీవ్రవాదం ఎక్కడ ఉన్నా, అది ఏ రూపంలో ఉన్నా ఆమోద‌యోగ్యం కాదని పారిక‌ర్ పేర్కొన్నారు.

More Telugu News