: కష్టాల నుంచి గట్టెక్కడానికి.. కన్యత్వాన్ని వేలానికి పెట్టిన 20 ఏళ్ల యువతి!

సాధారణంగా ఎవరికైనా ఆర్థిక సమస్యలు వచ్చినా, లేదా తాము ఎంతో ఇష్టపడే కుటుంబీకులకు ఆర్థిక సమస్యలు వచ్చినా... తమకు తోచిన మార్గాల ద్వారా ఆ సమస్య నుంచి గట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, తన కుటుంబం ఒక్కసారిగా కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోవడంతో... అమెరికాకు చెందిన కేథరిన్ స్టోన్ అనే 20 ఏళ్ల యువతి ఏకంగా తన కన్యత్వాన్నే వేలానికి పెట్టింది. వివరాల్లోకి వెళ్తే, 2014లో సియాటెల్ సిటీలో ఉన్న కేథరిన్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్తులు, విలువైన సామాగ్రి అంతా ఆహుతయ్యాయి. ఈ ఘటనతో, అప్పటిదాకా హాయిగా బతికిన ఆ కుటుంబం... రోడ్డున పడింది. రోజులు గడవడం కూడా కష్టమైంది. తన కుటుంబ సభ్యులు పడుతున్న దీన స్థితిని, వేదనను చూసి కేథరిన్ తట్టుకోలేక పోయింది. ఎంత ఆలోచించినా బతకడానికి సరైన మార్గం ఆమెకు తోచలేదు. దీంతో, తన కన్యత్వాన్నే ఆన్ లైన్ లో పెట్టాలనుకుంది. వెంటనే, నెవడాలో వ్యభిచారాన్ని నిర్వహించే డెన్నిస్ హాఫ్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి, తన మనసులోని ఆలోచనను అతనికి చెప్పింది. దీంతో, ఆమె గురించి ఆన్ లైన్ లో అతను ప్రకటన ఇచ్చాడు. ఇప్పటి వరకు నాలుగు లక్షల డాలర్లకు ఓ బిడ్ వచ్చిందని కేథరిన్ తెలిపింది. తన వారి కష్టాలు తీరిన తర్వాత, న్యాయవాద కోర్సును చేస్తానని ఆమె తెలిపింది. మరోవైపు, కేథరిన్ నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నో మార్గాలు ఉండగా, ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా 'నా శరీరంపై నాకు పూర్తి హక్కు ఉంది. నాకున్న ఇబ్బందుల కారణంగా ఇలా చేయక తప్పలేదు', అని కేథరిన్ వివరిస్తోంది.

More Telugu News