: ఏఓబీలో మళ్లీ ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో మళ్లీ ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. భారీ ఎన్‌కౌంటర్ జరిగి 24 గంటలు కూడా గడవకముందే మరోమారు ఏఓబీ ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. కూంబింగ్ పార్టీలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు మృతి చెందారు. నిన్న జరిగిన కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు మరో ముగ్గురు మృతి చెందడంతో మృతి చెందిన మావోల సంఖ్య 27కు చేరుకుంది. మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలోని రామ్‌గఢ్-పనస్‌పుట్ మధ్య నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ సమీపంలోనే తాజా ఎన్‌కౌంటర్ కూడా జరగడం గమనార్హం.

More Telugu News