: రాజమహేంద్రవరం రోడ్డు, రైలు బ్రిడ్జిపై ప్రమాదం.. వంతెనపై నుంచి కిందపడిన లారీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు బ్రిడ్జిపై మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి కిందనున్న రైల్వే ట్రాక్‌పై పడింది. బ్రిడ్జిపై వెళ్తున్న మరో లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకొట్టింది. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని రైల్వే ట్రాక్‌పై పడింది. దీంతో రైల్వే విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లారీని తొలగించారు. మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్లను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.