: భారత్-పాక్ మధ్య కాశ్మీర్ సమస్యే ప్రధానమైంది: నవాజ్ షరీఫ్
కుక్కతోకలాంటిదే తన బుద్ధి అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి నిరూపించారు. అంతర్జాతీయ సమాజం ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కశ్మీర్ అంశం లేవనెత్తకుండా ఆ దేశం నిద్రపోవడం లేదు. పాకిస్థాన్ లో తన పదవిని కాపాడుకోవడానికి నవాజ్ షరీఫ్ ముందు ఉన్న ఏకైక సాధనం భారత్ మీద విద్వేషం వెళ్లగక్కడమే. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా నవాజ్ షరీఫ్ భారత్ పై విషం కక్కుతుంటారు. అందులో భాగంగా ఇస్లామాబాద్ లో బ్రిటిష్ జాతీయ భద్రతా సలహాదారు సర్ మార్క్ లైయాల్ గ్రాంట్ తో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ ల మధ్య కశ్మీర్ అంశమే అత్యంత ప్రధానమైనదని మరోసారి కామెంట్ చేశారు.
ఈ అంశం పరిష్కారమైతే ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చూపిన పరిష్కారం ప్రకారం కశ్మీర్ అంశాన్ని పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన వంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వాటిపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని ఆయన గ్రాంట్ ను కోరారు. కశ్మీర్ లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో వందల మంది తీవ్రంగా గాయపడ్డారని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన గ్రాంట్...ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చేసే ప్రయత్నాలను తాము ప్రోత్సహిస్తామని అన్నారు.