: ‘టాటా సన్స్’ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీకి ఉద్వాసన
‘టాటా సన్స్’ చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. కొత్త చైర్మన్ ను ఎంపిక చేసేందుకు ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ లో రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోన్ సేన్, కుమార్ భట్టాచార్య ఉన్నారు. అయితే, నాలుగు నెలల పాటు తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, 2012లో టాటా సన్స్ సంస్థ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించారు.