: చైనా, భారత్‌లో ఆందోళనకర రీతిలో వాయు కాలుష్యం.. అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ
చైనా, భారత్‌లలో వాయు కాలుష్యం ఆందోళనకర రీతిలో పెరిగిపోతోందని అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ తెలిపారు. ఆ రెండు దేశాల్లో విడుదలవుతున్న కాలుష్యం ఓ పొరలా ఆకాశాన్ని కప్పేస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష కేంద్రం నుంచి ఆ దేశాలు మసగ్గా కనిపించడానికి వాయు కాలుష్య పొరే కారణమని వివరించారు. ఏడాదిపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన స్కాట్ ఇటీవలే తిరిగి భూమిని చేరారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చైనా, భారత్‌లలో వాయుకాలుష్యం వేగంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాలపై కాలుష్య పొర పేరుకుపోయిందని తెలిపారు.