: నా చిట్టి కూతురు తొలి పలుకు ఇదేనంటూ సంబరపడుతున్న జుకర్ బర్గ్!


తన రెండేళ్ల చిట్టి కూతురు మాక్స్ తొలి పలుకు గురించి చెబుతూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తెగ ఆనందపడిపోతున్నాడు. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. ఇంతకీ తన ముద్దుల కూతురు మాట్లాడిన తొలి మాట ఏమిటంటే.. ‘డాగ్’ అని. జుకర్ బర్గ్ పెంపుడు కుక్క పేరు ‘బీస్ట్’. దీనికి, మాక్స్ కు మధ్య స్నేహం బాగా కుదిరిందట. మాక్స్ తినే ఆహారపదార్థాలు కిందపడితే కనుక వాటిని ‘బీస్ట్’ తింటుందని జుకర్ బర్గ్ తన ఫాలోవర్లకు చెప్పారు.

  • Loading...

More Telugu News