: టీమిండియా టార్గెట్ 243 పరుగులు.. మూడేసి వికెట్లు తీసిన బూమ్రా, మిశ్రా
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న రెండో మ్యాచులో న్యూజిలాండ్ టీమ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గుప్తిల్-0, లాథమ్-46, విలియమ్ సన్-118, టైలర్-21, అండర్సన్-21, రాంచీ-6, సాంటేర్(నాటౌట్) -9, డేవ్‌సిక్-7, సౌతీ-0, హెన్రీ-6, బౌల్ట్(నాటౌట్)-5 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ 42 పరుగులిచ్చి 1 వికెట్టు తీయగా, ఆక్సర్ 49 పరుగులిచ్చి 1 వికెట్టు తీశాడు. జాధవ్ 11 పరుగులు ఇచ్చి 1 వికెట్టు తీశాడు. బూమ్రా 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, మిశ్రా 60 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 45 పరుగులిచ్చిన పాండ్యాకి ఒక్కవికెట్టు కూడా దక్కలేదు. ఎక్స్ ట్రాల రూపంలో న్యూజిలాండ్ కు మరో మూడు పరుగులు దక్కాయి. న్యూజిలాండ్ రన్ రేట్ 4.84గా నమోదయింది. మ్యాచ్ ఆరంభంలో తడబడిన భారత్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ వికెట్లను వెనువెంటనే కూల్చేశారు. దీంతో న్యూజిలాండ్ భారత్ ముందు 243 పరుగుల లక్ష్యం మాత్రమే ఉంచగలిగింది.