: నిరసన కార్యక్రమాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం.. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామన్న జానారెడ్డి
తెలంగాణలో రైతు సమస్యలపై పోరుతో వరుస నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా మానుకోటలో ‘రైతు గర్జన సభ’ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా టీపీసీసీ నేత జానారెడ్డి మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేవరకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజల ఆవేదన, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లే పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన చెప్పారు. దేశాభివృద్ధికి కృషి చేసిన ఎందరో మహానుభావులు తమ పార్టీలో ఉన్నారని ఆయన చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ గుప్పించిన హామీలు ఇంతవరకూ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.