: వినయంగా నమస్కరించిన కాజల్ ను ఆశీర్వదించిన రానా తమ్ముడు... మీరూ చూడండి!


ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్, ఓ స్వామీజీకి నమస్కరిస్తుండగా, ఆయన ఆశీర్వదిస్తున్నట్టున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ముఖాన గంధం, కుంకుమ బొట్టుతో, కాషాయ దుస్తుల్లో ఉన్న ఈ స్వామీజీ ఎవరో తెలుసా? దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్. కాజల్ వినయంగా నమస్కరిస్తుంటే, ఆశీర్వదిస్తున్నాడు. ఇటీవలే రానా సరసన తొలిసారిగా చాన్స్ కొట్టేసిన కాజల్, తన సుదీర్ఘ కెరీర్ లో ఫస్ట్ టైమ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నటిస్తోంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా, ఆ చిత్రం లొకేషన్ లోనే ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News