: ఢిల్లీ వన్డే: సెంచరీతో అదగొట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కానె విలియ‌మ్స‌న్


భారత్-న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌రుగుతున్న రెండో వన్డే మ్యాచులో న్యూజిలాండ్ టీమ్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 33 ఓవ‌ర్ల‌కు మూడు వికెట్ల‌ను కోల్పోయింది. గుప్తిల్ ప‌రుగులేమీ చేయ‌కుండానే వెనుదిరిగిన త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన కానె విలియ‌మ్స‌న్ 100 ప‌రుగులు చేసి అదరగొట్టాడు. జాధ‌వ్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ లాథమ్ ఎల్బీడబ్యూగా 46 ప‌రుగుల వ‌ద్ద ఔట్ కాగా, ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన టైల‌ర్ 21 ప‌రుగులకి మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. క్రీజులో కానె, అండ‌ర్సన్ (3 ప‌రుగులు) ఉన్నారు. న్యూజిలాండ్ స్కోరు 180/3 గా ఉంది. మొద‌టి వ‌న్డేలో అద్భుతంగా రాణించి న్యూజిలాండ్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన టీమిండియా బౌల‌ర్లు రెండో వ‌న్డేలో మాత్రం వికెట్లు తీయ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు. న్యూజిలాండ్ ర‌న్‌రేట్ ఓవ‌రుకి 5 ప‌రుగులుగా ఉంది. భారత బౌలర్లలో ఉమేష్, మిశ్రా, జాధవ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

  • Loading...

More Telugu News