: మీ సినిమాకు ఏ ఇబ్బందీ రానివ్వను: కరణ్ జొహార్ కు రాజ్ నాథ్ అభయం
పాకిస్థాన్ నటుడు ఫవాద్ ముఖ్య పాత్ర పోషించిన 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రం విడుదల గండాన్ని ఎదుర్కొంటున్న వేళ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభయమిచ్చారు. ఈ ఉదయం ముఖేష్ భట్ నేతృత్వంలోని నిర్మాతల సంఘంతో కలసి చిత్ర నిర్మాత కరణ్ జొహార్ రాజ్ నాథ్ ను కలిసి చర్చలు జరుపగా, ఏ విధమైన హింసాత్మక ఘటనలు జరుగకుండా 100 శాతం పోలీసు భద్రతను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన ముఖేష్ భట్, "థియేటర్ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అందరు ముఖ్యమంత్రులతో తాను మాట్లాడుతానని రాజ్ నాథ్ చెప్పారు" అన్నారు. కాగా, తనకు దేశమే ముఖ్యమని, దేశం ముందు మరే విషయమూ ఎక్కువ కాదని, ఇకపై తన చిత్రాల్లో పాకిస్థాన్ నటీ నటులను వినియోగించనని కరణ్ జొహార్ వెల్లడించిన సంగతి తెలిసిందే.