: రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత తొలి మ్యాచ్ ఆడిన సింధు.. డెన్మార్క్‌ ఓపెన్‌లో శుభారంభం


ఇటీవ‌ల బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఒలింపిక్స్ లో పతకం సాధించి, నూతన ఉత్సాహంతో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు రియో పోటీల‌ త‌రువాత తొలి మ్యాచ్ ఆడింది. డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. మొదటి రౌండ్‌లో విక్ట‌రీ సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 21-14, 21-19 వరుస సెట్లలో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై సింధు విజ‌యం సాధించింది. రెండో రౌండ్ జపాన్‌ క్రీడాకారిణి సయాకా సాటోతో జ‌ర‌గ‌నుంది. గత ఎడిషన్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో మంచి విజ‌యాలు న‌మోదు చేసుకొని ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లిన సింధుకు ఓట‌మి ఎదురైంది. ఈ సారి టైటిల్ నెగ్గాలనే ప‌ట్టుద‌ల‌తో ఉంది.

  • Loading...

More Telugu News