: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ
కొన్ని నెలల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టులో ఈ రోజు తెలంగాణ ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో మున్ముందు జరగనున్న పరిణామాలపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.