: విడాకులకు దారితీసిన ‘మేకప్’ అందాలు!
తన భార్య అందగత్తె అని అనుకుంటున్న భర్త, ఆమె అసలు స్వరూపం చూసి షాక్ అయ్యాడు. దీంతో, ఈ కొత్త జంట విడాకులు తీసుకున్న సంఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగింది. కొత్తగా పెళ్లయిన ఒక జంట షార్జాలోని అల్ మంజార్ బీచ్ కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ చేశారు. ఆ తర్వాతే, ఆమె అసలు రూపం బయటపడింది. ఆమె పెట్టుకున్న నకిలీ కనురెప్పలు, వేసుకున్న మేకప్ మొత్తం పోయింది. అంతకుముందు వరకూ ఎంతో అందంగా కనిపించిన తన భార్య ముఖం ఒక్కసారిగా మారిపోవడంతో భర్త కంగుతిన్నాడు. తనను మోసం చేసారని భావించిన సదరు భర్త ఆవేదన చెందడమే కాకుండా, విడాకులు ఇచ్చేశాడు. కాగా, ఈ విషయమై అతని భార్య మాట్లాడుతూ, విడాకుల అనంతరం తన మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒక సైకాలజిస్టును కూడా సంప్రదించానని చెప్పింది. అయితే, తన మేకప్, నకిలీ కనురెప్పలు, తాను చేయించుకున్న కాస్మొటిక్ సర్జరీల గురించి తన భర్తకు చెబుదామని అనుకున్నానని, కానీ, అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చెప్పింది.