: ‘మెగా ఆక్వాఫుడ్ పార్క్ మాకు కావాలి’... పశ్చిమ గోదావరిలో జగన్‌కు నిరసన సెగ
మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులను పరామర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఏలూరులో రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. జగన్ పర్యటనను నిరసిస్తూ ఆ ప్రాంత రైతులు ర్యాలీ తీశారు. 'మెగా ఆక్వాఫుడ్ పార్క్ మాకు కావాలి' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ అందుకు అడ్డుతగలకూడదంటూ నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే కూర్చొని రైతులు తమ నిరసనను కొనసాగించారు.