: మంత్రి చినరాజప్పను అవమానించానని ‘సాక్షి’ మీడియా రాయడం అవాస్తవం: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్పను తాను అవమానించానని సాక్షి మీడియా కథనాలు రాయడం అవాస్తవమని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తాను చేరాలో లేదో పొలిట్‌బ్యూరో నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రభుత్వ నిర్ణయాలకే కట్టుబడి ఉండాలని చెప్పారు. రాజకీయంగా ఎదగాలని తనకు అత్యాశ లేదని చెప్పారు. పార్టీ నిర్ణయం మేరకే తాను ప్రధాన కార్యదర్శిని అయినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాన్ని ఆపుకోవాలని సూచించారు.