: ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్: చంద్రబాబు


ఎస్సీ, ఎస్టీలకు నెలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ రోజు వివిధ సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నామని చెప్పారు. బీసీల కోసం సబ్ ప్లాన్ తెచ్చామని, ముస్లింల సంక్షేమానికి కూడా బడ్జెట్ పెంచామని తెలిపారు. విద్యార్థులకు ఆర్థికసాయం, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన, సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. పొదుపు సంఘాలను ప్రోత్సహిస్తున్నామని... ప్రతి మహిళకు రూ. 10 వేల మూలనిధి సాయంగా అందిస్తామని వెల్లడించారు. పేదల సేవే పరమావధిగా ప్రతి అధికారి, ఉద్యోగి భావించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News