: ముద్దు వద్దన్న చిన్నారి.. తన మాటే నెగ్గించుకున్న ట్రంప్!


అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆకర్షించేందుకుగాను ఆయన చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఓపెన్ డిబేట్ కు వచ్చిన వారిలో ముందు ఉన్న ఒక చిన్నారిని తన దగ్గరకు రమ్మనమని ట్రంప్ పిలవడంతో వెళ్లింది. అయితే, ట్రంప్ సూచనలను మాత్రం ఆ చిన్నారి పాటించలేదు. ఓపెన్ డిబేట్ కు హాజరైన వారిని విష్ చేయమని చెప్పిన ట్రంప్ మాటలకు ఆ చిన్నారి స్పందించలేదు. దీంతో, షాక్ అయిన ట్రంప్.. ఒక్క నిమిషం ఆలోచించి, ఆ చిన్నారిని తన దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకోబోయారు. దీంతో, భయపడ్డ చిన్నారి ట్రంప్ ను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించింది. ఇక లాభం లేదనుకున్న ట్రంప్ ఆ చిన్నారిని బలవంతంగా ముద్దులు పెట్టేసుకున్నారు. కాగా, ఈ సంఘటనపై మీడియాలో పలు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News