: 136 ఏళ్లలో రికార్డు ఉష్ణోగ్రత... ఆ ఘనత ఈ సెప్టెంబరు నెలది!


గత నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో కురిసిన భారీ వ‌ర్షాల‌కి అనేక ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం అస్త‌వ్యస్త‌మైన విష‌యం తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా మాత్రం సెప్టెంబ‌రులో భారీ ఉష్ణోగ్రతలు నమోదయి రికార్డు నెలకొల్పాయి. గ‌త 136 ఏళ్ల‌లో అన్ని సంవ‌త్స‌రాల సెప్టెంబ‌రు నెల‌ల‌ ఉష్ణోగ్ర‌త‌ల్లో ఈ ఏడాది సెప్టెంబ‌రు ఉష్ణోగ్ర‌తే అధికంగా ఉంద‌ని అమెరికాలోని నాసాకు చెందిన గోడార్డ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ స్టడీస్‌ (జీఐఎస్‌ఎస్‌) పేర్కొంది. గతంలో 2014లో సెప్టెంబ‌రులో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త న‌మోద‌యింది. ఇప్పుడు ఆ రికార్డును దాటుకొని ఈ ఏడాది సెప్టెంబ‌రు ఉష్ణోగ్ర‌త రికార్డు నెల‌కొల్పింది. ఆ ఉష్ణోగ్ర‌త క‌న్నా గ‌త‌నెల ఉష్ణోగ్ర‌త 0.004 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైంది. 1951-1980 మధ్య కాలంలో సెప్టెంబర్‌ మాసాల్లో న‌మోద‌యిన ఉష్ణోగ్ర‌త క‌న్నా ఈ ఏడాది సెప్టెంరు ఉష్ణోగ్ర‌త‌ 0.91 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉంది. కాగా, 1998, 2015 జూన్ మాసాల ఉష్ణోగ్ర‌త‌లు తీసుకుంటే, ఈ ఏడాది జూన్‌లో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింద‌ని జీఐఎస్‌ఎస్ పేర్కొంది. సద‌రు సంస్థ ఉష్ణోగ్ర‌త వివ‌రాల‌ను 1880 నుంచి ప్రతీ నెలా న‌మోదు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌పంచవ్యాపంగా ఉన్న 6,300 మెట్రోలాజికల్‌ స్టేషన్స్ సాయంతో ఈ సంస్థ ఉష్ణోగ్ర‌త వివ‌రాల‌ను న‌మోదు చేస్తుంది.

  • Loading...

More Telugu News