: కూలిన పాక్ యుద్ధ విమానం.. పైలట్ మృతి
ట్రైనింగ్ మిషన్ లో భాగంగా వెళ్తున్న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. ఈ సంఘటనలో పైలట్ మృతి చెందాడని పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. మస్రూర్ బేస్ నుంచి వెళ్తుండగా కరాచీకి 16 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని చెప్పారు. జనావాసాలకు దూరంగా ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదన్నారు. సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని, ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.