: ఏసీ గదుల్లో కూర్చుని నోటికి వచ్చింది మాట్లాడకండి: బాలీవుడ్ నటులపై ఫైర్ అయిన గంభీర్
పాకిస్థాన్ నటులకు మద్దతు తెలిపిన వారిపై క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో తన భావాలు వ్యక్తం చేసిన గంభీర్, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ నటులకు మద్దతివ్వడం శోచనీయమని పేర్కొన్నాడు. సినిమాలు, క్రికెట్ కంటే దేశమే గొప్పదన్న విషయం గుర్తించాలని సూచించాడు. ఏసీ గదుల్లో కూర్చుని నోటికి ఏదొస్తే అది మాట్లాడవద్దని హెచ్చరించాడు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పెట్టేవరకు ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించకూడదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.