: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. తనిఖీలు చేపడుతున్న పోలీసులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబులు పెట్టినట్లు ఈ రోజు మధ్యాహ్నం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌లోని 2, 7 ప్లాట్‌ఫాంలలో బాంబులు పెట్టినట్లు 100 నెంబర్ కు ఓ దుండగుడు ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు. డాగ్, బాంబుస్క్వాడ్‌తో రైల్వేస్టేషన్ లో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.