: ప్రత్యేకహోదాపై హైకోర్టులో సినీ నటుడు శివాజీ పిల్


ప్రత్యేకహోదాపై 'ప్రత్యేకహోదా సాధన సమితి' అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆయన పిల్ వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రెండు వారాల తరువాత దీనిని విచారిస్తామని తెలిపింది. దీనిపట్ల ప్రత్యేకహోదా సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. పునర్వ్యవస్థీకరణ బిల్లులో ప్రత్యేకహోదాలో పేర్కొందని, ప్యాకేజీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. శివాజీ తీసుకున్న నిర్ణయం ముదావహమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను నేతలు గాలికొదిలేస్తే, ప్రజల తరపున ఆయన పిల్ దాఖలు చేయడం, దానిని హైకోర్టు విచారణకు స్వీకరించడం హర్షణీయమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News