: పద్మభూషణ్ పురస్కారానికి పీవీ సింధు, మురళీమోహన్ ల పేర్లను సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం


అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాల కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసింది. పద్మభూషణ్ కోసం ఒలింపిక్ విజేత పీవీ సింధు, మరో క్రీడాకారుడు శ్రీకాంత్, టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్, ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీష్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ గురవారెడ్డి, మృదంగం విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు, నర్తకి ఆనంద్ శంకర్ జయంత్, ప్రముఖ డాక్టర్ సీకే దుర్గ పేర్లను నామినేట్ చేసింది. పద్మశ్రీ పురస్కారాల కోసం చేనేత రంగ ప్రముఖుడు రమణయ్య, ఈఎన్ టీ స్పెషలిస్ట్ విష్ణు స్వరూప్ రెడ్డి తదితరుల పేర్లను సిఫారసు చేసింది. ఈ పురస్కారాల కోసం మొత్తం 22 మంది ప్రముఖుల పేర్లను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సూచించింది. రిపబ్లిక్ డే నాడు పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

  • Loading...

More Telugu News