: బ్రిటన్ పార్లమెంటు ప్రాంగణంలో మహిళపై రేప్!


బ్రిటన్ పార్లమెంటు భవనంలో ఓ మహిళపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అత్యాచారం అక్టోబర్ 14వ తేదీ ఉదయం జరిగిందని పోలీసులు వెల్లడించారు. సెక్సువల్ అఫెన్సెస్ డిటెక్టివ్ లు, అత్యాచార నిరోధక అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. రేప్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 23 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే, ప్రస్తుతం అతనికి బెయిల్ లభించింది. కోర్టులో తదుపరి విచారణ 2017 జనవరిలో జరుగనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు కాదని... కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ ఎంపీ తరపున అతను పనిచేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. జరిగిన ఘటనపై విచారణకు సంబంధించి పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని పార్లమెంట్ స్పోక్స్ పర్సన్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నందున, దీనిపై ప్రస్తుతానికి స్పందించలేమని కన్జర్వేటివ్ పార్టీ తెలిపింది.

  • Loading...

More Telugu News