: మా ఆయన బంగారం.. ఏకాంతంలో కూడా ఆయన అలా ఎప్పుడూ మాట్లాడలేదు: ట్రంప్ భార్య


అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను లైంగిక వేధింపుల ఆరోపణలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన పదే పదే చెబుతున్నా... ప్రత్యర్థి పార్టీ, మీడియా ఆయనను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్ కు ఆయన భార్య మెలానియా నుంచి మద్దతు లభించింది. సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలానియా మాట్లాడుతూ, "మా ఆయన బంగారం" అని చెప్పారు. తన భర్తపై తనకు పూర్తి నమ్మకం ఉందని... ఈ వ్యతిరేక ప్రచారమంతా ప్రతిపక్షమే చేస్తోందని ఆమె ఆరోపించారు. తన భర్త అసభ్యంగా ప్రవర్తించారంటూ కొందరు మహిళలు ఆరోపించారని... అయితే, ఆరోపణలు చేసిన మహిళల నేపథ్యం ఏమిటో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన భర్త అలాంటి మాటలు మాట్లాడారంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. తామిద్దరం ఏకాంతంగా ఉన్న సమయంలో కూడా ఆయన అనుచితంగా మాట్లాడిన సందర్భాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News