: తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది: కేంద్రమంత్రి దత్తాత్రేయ
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర నేత దత్తాత్రేయ అన్నారు. ఈ రోజు మంచిర్యాలలోని బెల్లంపల్లిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తమ పార్టీ బలం పెరుగుతోందని చెప్పారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ దేశం ముందుకెళుతోందని, అవినీతి రహిత పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.