: దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన హజీ అలీ దర్గా


దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హజీ అలీ దర్గా ట్రస్ట్ ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హజీ అలీ దర్గాలో మహిళలు ప్రవేశంచవచ్చంటూ ఆగస్ట్ 26న బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో, బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్రస్ట్ సభ్యులు సుప్రీంలో పిటిషన్ వేశారు. గతంలో దర్గాలోకి మహిళలను అనుమతించేవారని... అయితే, షరియత్ నియమ నిబంధనల ప్రకారం వారిని నిషేధించాలనే నిర్ణయాన్ని కొన్నాళ్ల క్రితం తీసుకున్నామని తన పిటిషన్ లో దర్గా ట్రస్ట్ పేర్కొంది.

  • Loading...

More Telugu News