: జనగాం జిల్లాలోని మూడు మండలాల్లో 144 సెక్షన్
కొత్తగా ఏర్పాటైన జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, జఫర్గడ్, చిల్పుర్ మండలాల్లో 144 సెక్షన్ విధించారు. తమ మండలాలను వరంగల్ జిల్లాలో కలపాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సెక్షన్ విధించారు. గత కొన్ని రోజులుగా ఈ మూడు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఖాజీపేట ఏసీపీ మాట్లాడుతూ, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాలు, నిరసనలు, సమావేశాలు, రోడ్ల మీద వంటా వార్పు కార్యక్రమాలు చేపట్టరాదని... నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.