: రీటా బహుగుణ బీజేపీలో చేరరు: విజయ్ బహుగుణ


తన సోదరి, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రీటా బహుగుణ బీజేపీలో చేరుతున్నారని వచ్చిన వార్తలను విజయ్ బహుగుణ కొట్టిపారేశారు. ఆమె బీజేపీలో చేరబోరని కొద్దిసేపటిక్రితం విజయ్ తెలిపారు. మీడియా వార్తలన్నీ పుకారులేనని, రీటా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. కాగా, ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ, రీటా బీజేపీలో చేరనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్న వేళ, ఈ వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపగా, దానిపై విజయ్ బహుగుణ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News