: ఆ 10 వేల కోట్ల రూపాయల వ్యక్తి గురించి కేంద్రం వెల్లడించాలి: వర్ల రామయ్య


స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో భాగంగా 10 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన హైదరాబాదీ ఎవరో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆ 10 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న వ్యక్తి వైఎస్సార్సీపీ అధినేత జగన్ అని టీడీపీ నేతలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత ప్రధానికి లేఖ రాస్తూ ఆ వ్యక్తి పేరు వెల్లడించాలని, ఎవరికీ తెలియని ఆ వ్యక్తి పేరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలా తెలిసిందని ప్రశ్నిస్తూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య కర్నూలులో మాట్లాడుతూ, పది వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చిన హైదరాబాదీ ఎవరో కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఆ వ్యక్తి ఎవరో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసుని అన్నారు. జగన్ కు సంబంధించిన 11 ఆర్థిక నేరాల కేసుల్లో విచారణ కోసం సమాచారం రాబట్టాలని సీబీఐ కోర్టును వర్ల రామయ్య కోరారు.

  • Loading...

More Telugu News