: అసలా రోజు ఏం జరిగింది?: రెండేళ్ల నాటి ఘటనపై శ్వేతా బసూ ప్రసాద్


శ్వేతా బసూ ప్రసాద్... ఈ పేరు కన్నా, 'కొత్త బంగారు లోకం' సినిమాలో 'ఎక్కడా...' అంటూ సాగదీస్తూ మాట్లాడిన అమ్మాయి అంటే ఎవరికైనా తెలిసిపోతుంది. ఒక్క సినిమాతోనే తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్వేతా బసూ ప్రసాద్ కెరీర్ లో ఓ మరక. అది కూడా చిన్నది కాదు. హైదరాబాద్ లోని స్టార్ హోటల్ లో బ్రోతల్ కేసులో పట్టుబడింది. ఆపై రెస్క్యూ హోమ్ కు వెళ్లి, కోర్టు కేసు కొట్టేయడంతో బయటపడింది. టీవీ షోలు, హిందీ సీరియల్స్ చేస్తూ, తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ ను 'మిక్చర్ పొట్లం' ద్వారా మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, రెండేళ్ల నాడు అసలేం జరిగిందో చెప్పింది. "సినీ వారపత్రిక ‘సంతోషం’ ప్రకటించిన అవార్డుల వేడుకలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాను. ఓ స్టార్ హోటల్‌ లో దిగాను. అవార్డుల ఫంక్షన్ పూర్తి కాగానే ముంబై వెళ్లిపోవాలని అనుకున్నాను. కానీ, నేను వెళ్లాల్సిన విమానం మిస్ అయింది. దీంతో హోటల్‌ లోనే ఉండిపోయాను. ఏం జరిగిందో ఏమో ఆ సమయంలో హోటల్‌ పై పోలీసులు దాడి చేయడం, నన్ను అరెస్ట్ చేయడం జరిగాయి. ఆపై జరిగింది మీకు తెలిసిందే. నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత పోలీసులు ముందుగా అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే పెద్ద విజయాలు చూశాను. వాటి ముందు ఈ సమస్యలు చాలా చిన్నవి" అన్నారామె. ఇక ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదని, హిందీలో ఏక్తా కపూర్ నిర్మాతగా తీస్తున్న 'చంద్ర నందిని' సీరియల్ లో రాకుమార్తె వేషం వేస్తున్నానని, ఇది రెగ్యులర్ అత్తా కోడళ్ల గొడవలతో ఉండే సీరియల్ కాదని, ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నానని చెప్పిందీ బొద్దు గుమ్మ.

  • Loading...

More Telugu News