: బెస్ట్ ప్రెండ్స్ తో మినీ బస్సులో సచిన్ సుమధుర ప్రయాణం!
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో స్నేహితులతో గడపాల్సిన ఎన్నో క్షణాలను సచిన్ మిస్సయ్యాడు. నిరంతరం ఆటలో బిజీగా ఉండడంతో స్నేహితులను ఎక్కువగా కలవడం కుదర్లేదు. రిటైర్ అయిన తరువాత ఒక్కో అనుభూతిని సచిన్ ఆస్వాదిస్తున్నాడు. అందులో భాగంగా సచిన్ ఈ మధ్య తన స్నేహితులతో కలిసి ఓ మినీ బస్సులో ప్రయాణించాడు. ఈ సందర్భంగా సచిన్ తో పాటు స్నేహితులు కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు వారి ముఖాలు చూస్తే తెలిసిపోతోంది. స్నేహితులతో సెల్ఫీ దిగిన సచిన్ అది సోషల్ మీడియాలో పోస్టు చేసి ‘బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి మినీ బస్సులో ప్రయాణించడం ఓ మధురమైన అనుభూతి’ అని పేర్కొన్నాడు. మీరు కూడా ఆ ఫోటోను చూడండి.