: అమెరికాలో బాహాబాహీకి దిగి, పరువుతీసిన 'ఆటా' ప్రతినిధులు


అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు బాహాబాహీకి దిగి పరువుతీశారు. తెలుగు వారి మధ్య ఐకమత్యం కోసం పెట్టిన ఈ అసోసియేషన్ లో సుదీర్ఘ కాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 13న షికాగోలో జరిగిన సభ్యుల నామినేషన్ సందర్భంగా చోటుచేసుకున్న గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎంపిక సందర్భంగా హరిధర్ రెడ్డి, హనుమంత రెడ్డి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం, బూతులు తిట్టుకుని, చొక్కాలు పట్టుకుని తన్నుకున్నంత వరకు వెళ్లింది. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను తీసుకుని హనుమంత రెడ్డి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News