: ఒక్కో ఎపిసోడ్ కు చిరంజీవి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?


తెలుగు సినీ రంగాన్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజులా ఏలిన చిరంజీవి... సినీ పరిశ్రమ రూపు రేఖల్నే మార్చేశారనడంలో సందేహం లేదు. సినిమా స్పీడ్ ను పెంచడమే కాక... లక్షల్లోని రెమ్యునరేషన్ ను కోట్లలోకి తీసుకెళ్లిన మెగాస్టార్ ఆయన. ప్రస్తుతం తన 150వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న చిరు... మాటీవీ నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే, చిరంజీవికి రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చనే విషయంలో భారీ చర్చే సాగుతోంది. ఈ ప్రోగాం కోసం చిరంజీవికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు నిర్వాహకులు. ఒక్కో ఎపిసోడ్ కు రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్ని ఎపిసోడ్ లు ప్రసారమైతే అన్ని పది లక్షలు చిరంజీవికి ముడతాయన్నమాట. మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్వాహకులు రెడీ అయ్యారు. మరోవైపు, చిరంజీవి మొట్టమొదటి సారి బుల్లితెర మీద కనిపించనుండటంతో... ప్రేక్షకుల నుంచి భారీ స్పందన ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షోను అక్కినేని నాగార్జున నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News