: కలాం స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది: జగన్
మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు వైసీపీ అధినేత జగన్ నివాళి అర్పించారు. ఈ రోజు కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన నివాళులర్పించారు. స్ఫూర్తిప్రదాతగా అబ్దుల్ కలాం ఎన్నటికీ నిలిచిపోతారని ఈ సందర్భంగా జగన్ కొనియాడారు. 2015లో షిల్లాంగ్ లోని ఐఐఎంలో నిర్వహించిన ఓ సెమినార్ లో ప్రసంగిస్తూ కలాం కుప్పకూలి పోయారు. అనంతరం బెథాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 1931లో తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15న అబ్దుల్ కలాం జన్మించారు. ట్విట్టర్ లో జగన్ అర్పించిన నివాళి ఇది... Remembering Bharat Ratna Sri Abdul Kalamji on his birth anniversary. He will remain an inspiration forever.