: ఇందుశ్రీని చంపింది బాలుడే.. దొంగతనాన్ని అడ్డుకోవడంతో హత్య
మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో హత్యకు గురైన చిన్నారి శ్రీలక్ష్మీ ప్రసన్న(ఇందుశ్రీ) హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమె ఇంటి సమీపంలో ఉండే బాలుడే చిన్నారిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఏడేళ్ల ఇందుశ్రీ బుధవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. బ్లేడుతో ఆమె గొంతు, మణికట్టు కోయడంతో మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. తాను దొంగతనం చేస్తుండగా ఇందుశ్రీ చూసి అడ్డుకునే ప్రయత్నం చేసిందని బాలుడు పేర్కొన్నాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, దీంతో వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు బాలుడు అంగీకరించినట్టు సమాచారం.