: నాగచైతన్యతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసిన సమంత... పబ్ లో ఫుల్ పార్టీ!


ప్రేమమ్ సినిమా విజయం సాధించడంతో తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని సమంత తెలిపిన సంగతి తెలిసిందే. కాబోయే భర్త నాగచైతన్యతో తాజాగా 'ప్రేమమ్' విజయాన్ని పూర్తి స్థాయిలో సమంత ఆస్వాదించింది. ఈ మేరకు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పార్టీలో అఖిల్ అక్కినేని, అల్లు శిరీష్ కూడా కనిపించడం విశేషం. ప్రచారంలో ఉన్న సమాచారం మేరకు 'ప్రేమమ్' సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య, ఆ సంతోషాన్ని సమంత, ఇతర స్నేహితులతో కలిసి ఓ పబ్ లో పంచుకున్నారు. వీరంతా ఓ పబ్ లో ఆనందంగా చిందులేశారు. చైతూ ఆనందమే తన జీవితమని చెప్పే సమంత, అలిసిపోయేంతగా డాన్స్ చేసింది.

  • Loading...

More Telugu News