: రంజీల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డు నెలకొల్పిన మరాఠాలు
రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు, భాగస్వామ్యం రికార్డును మహారాష్ట్ర జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో మహారాష్ట్ర రంజీ జట్టు చెలరేగి ఆడింది. దీంతో గత రికార్డులు చెరిగిపోయాయి. మహారాష్ట్ర బ్యాట్స్ మెన్ స్వప్నిల్ గుగాలే (351 నాటౌట్), అంకింత్ బాన్నే (258 నాటౌట్) మూడో వికెట్ కు అజేయంగా 594 పరుగులు జోడించి రంజీల్లో సరికొత్త అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డును నెలకొల్పారు. వీరిద్దరి విజృంభణతో మహారాష్ట్ర రెండు వికెట్ల నష్టానికి 635 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది.